నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 21:58

పేదింటి పెద్ద బిడ్డగా మీ సేవకునిగా వస్తున్న ఆశీర్వదించండి- కంచర్ల కృష్ణారెడ్డి

•నేను పుట్టిన ఈ గడ్డ అభివృద్ధి కోసం.. నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతూనే ఉంటా...

పేదింటి పెద్ద బిడ్డగా.. మీ సేవకునిగా వస్తున్నానని.. ప్రజలందరూ ఆశీర్వదించాలని బిఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారు కోరారు...

నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. నల్లగొండకు తొలిసారిగా వచ్చిన ఆయన VT కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భాస్కరరావు, కంచర్ల భూపాల్ రెడ్డి గార్లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన.. నేను పుట్టిన ఈ గడ్డ అభివృద్ధి కోసం.. నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతూనే ఉంటానని అన్నారు.

•జిల్లాలో వేలాది ఎకరాలు ఎండిపోయి.. రైతన్నలు ఆగమైతుంటే.. కాంగ్రెస్ నాయకులు దున్నపోతుపై వర్షంలా వ్యవహరిస్తూ ఏసీ గదుల్లో కులుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

కేవలం 100 రోజుల్లోనే అత్యంత తీవ్రంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాన్ని నా 4o ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా చూడలేదని ఆయన అన్నారు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంకె బిందల కోసమే వచ్చాడు తప్ప.. ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు...

•పంటలు ఎండిపోయి రైతన్నలు హరిగోస పడుతుంటే .. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం కెసిఆర్ గారిని తిట్టేందుకే తన సమయం కేటాయిస్తున్నారని చురకలు అంటించారు.

ఓ రైతు బిడ్డగా రైతన్నలు పడే ఆవేదనను నాకు తెలుసని.. వారి సమస్యలపై పార్లమెంటులో పోరాడేందుకు నన్ను ఆశీర్వదించాలని మరోమారు ఆయన ప్రజలను కోరారు.

మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ గారు మాట్లాడుతూ..KCR గారు 30 రోజుల పాటు సుధీర్ఘంగా ఆలోచించి.. కంచర్ల కృష్ణారెడ్డి గారిని కృష్ణారెడ్డి గారిని ఎంపిక చేశారని ఆయన అన్నారు.

కంచర్ల కృష్ణారెడ్డి గారి కృషి వల్లే గత ఉప ఎన్నికల్లో హుజుర్ నగర్, నాగార్జున సాగర్ అభ్యర్థుల గెలిచారని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఎవరు లేకపోవడంతోనే బిఆర్ఎస్ నుంచి అభ్యర్థులను కొనుగోలు చేస్తుందని.. నోటుకు ఓటు దొరికిన దొంగకు ఇంతకన్నా పెద్ద ఆలోచనలు రావని ఎద్దేవా చేశారు.

బిజెపి గురించి మాట్లాడడమే శుద్ధ దండుగని.. బిజెపి కేవలం తన పెంపుడు కుక్కలైన ఈడీ , బోడీలతో బెదిరిస్తే భయపడమని ఆయన హెచ్చరించారు..

400 సీట్లు వస్తాయని.. బిజెపి ప్రజలను మభ్యపెడుతుందే తప్ప గెలిచేది లేదు.. చచ్చేదీ లేదంటూ ఆయన అన్నారు.

కెసిఆర్ గారు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలంటే 100 ఉన్నాయని.. మరి బిజెపి ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఈ ప్రెస్ మీట్ లో.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్,కనగల్ ఎంపీపీ కరీం పాషా, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య,బకరం వెంకన్న, ముస్లిం జమాల్ ఖాద్రి, సయ్యద్ జాఫర్, జాఫర్ పటేల్ సింగిల్ విండో చైర్మన్ లు ఆలకుంట నాగరత్నం రాజు,దోటి శ్రీనివాస్.. నల్లగొండ పట్టణ పార్టీ అధ్యక్షులు, బోనగిరి దేవేందర్,తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి అయితగోని యాదయ్య,దేప వెంకటరెడ్డిలు,నాయకులు... రావుల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు గోపి,చింతల యాదగిరి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, వనపర్తి నాగేశ్వరరావు, మిరియాల స్వామి,విద్యార్థి నాయకుడు నాగార్జున,తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 21:43

టీఎస్‌ జెన్‌కో ఏఈ పరీక్షలు వాయిదా..

తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TS,GENCO)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియా మక రాతపరీక్ష వాయిదా పడింది.

ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 31న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసి నట్లు జెన్‌కో ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని జెన్‌కో యాజమాన్యం పేర్కొంది...

Streetbuzz news

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 21:42

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలకు 30 నుంచి సమ్మర్ హాలిడేస్

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించిం ది. ఈ నెల 30 నుంచి మే 31 వరకు సెలవులు కొన సాగనున్నాయి.

జూన్ 1న కాలేజీలు మళ్లీ తెరవబడతాయి. ఈ సెల‌వులు రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ను న్నాయి.

ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసు కుంటామ‌న్నారు.

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌కు అనుగుణంగా అడ్మిష‌న్లు తీసుకోవాల‌ని, ఆ తేదీల‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడే ప్ర‌వేశాల ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని సూచించారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 21:41

బహుజనుల ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో గురువారం పోస్టర్లు వెలిశాయి.

కౌటాల మండల కేంద్రంలో.. బహుజన ద్రోహి RSP గోబ్యాక్ అంటూ కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు పోస్టర్లు అంటించారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్ఎస్ ప్రవీణ్ సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాల‌య్యారు.

ఆ త‌ర్వాత జరిగిన పరిణా మాల నేపథ్యంలో బీఆర్ ఎస్‌లో చేరారు...

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 21:40

జేఈఈ మెయిన్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు

జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసు కుంది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షల ను ఏప్రిల్ 4 నుంచి 12 వరకే నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

అంతకుముందు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. రెండుసార్లు తేదీల్లో మార్పు లు చేసింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం.. జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 బీఈ బీటెక్‌, పరీక్ష ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9 తేదీల్లో నిర్వహించను న్నారు.

పేపర్‌ – 2 పరీక్ష ఏప్రిల్‌ 12 వ తేదీన నిర్వహించను న్నారు. పేపర్‌-1 పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుండగా,

పేపర్‌-2 పరీక్ష ఒకే షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది.

విద్యా ర్థులు సిటీ ఇంటిమేషన్ వివరాలను jeemain. ac.in వెబ్సైట్లో చూసుకో వచ్చు. త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి.

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:27

బిజెపి నేత రాజాసింగ్ ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు

బిజెపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం చెంగిచెర్లకు వెళతానని ఆయన ప్రకటించారు.

అయితే అక్కడకు వెళ్లని చ్చేది లేదంటూ పోలీసులు అతనిని హౌస్ అరెస్ట్ చేశారు. హోలీ పండుగ నాడు చెంగిచెర్లలో హిందువులపై ముస్లిం వర్గం దాడి చేసింది.

ఈ దాడిలో గిరిజన మహిళ లు, యువకులు గాయపడ్డా రు. గాయపడ్డ వారిని పరా మర్శించేందుకు వెళ్తానని రాజాసింగ్ చెప్పడంతో పోలీ సులు అతనికి అనుమతివ్వలేదు.

ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తు న్నారని రాజాసింగ్ మండి పడ్డారు. దాడికి గురైన వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

చెంగిచెర్లకు వెళ్లి బాధితు లను పరామర్శిస్తామంటే పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని నిలదీశారు.హిందువులపై అకారణంగా దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు.

వారిపై పెట్టిన అక్రమ కేసు లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లనీ యరా? అని నిలదీశారు. గాయపడిన మహిళలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామ న్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:19

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ లో కెసిఆర్ ను కలిసిన కే.కేశవరావు

పార్టీ మారుతారనే ఊహా గానాలు జోరందుకున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

కాసేసటి క్రితమే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు కేశవరావు. కేసీఆర్‌తో భేటీలో పార్టీ మార్పుపై కేకే వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుందనే వార్తలు రాగా.. కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కేకేను పార్టీలోకి ఆహ్వానించారు.

దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేప థ్యంలో కేసీఆర్‌ను కేకే కలవడం చర్చనీయంగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఇటీవల వ్యాఖ్యలు చేశారు కేకే.

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:18

కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్ని క పోలింగ్ సందర్భంగా.. స్వయంగా ఊరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకు న్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మొత్తం ఒక వెయ్యి 439 మంది ఓటర్ల కోసం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.

కొడంగల్ ఎంపీడీవో ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి, కొల్లూపూర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు.

మధ్యాహ్నం 2 గంటల వరకు 89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియ నుంది.

లోకల్ బాడీ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి తోపాటు స్వతంత్ర అభ్యర్థి గా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:17

హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా స్టార్ క్రీడాకారుని సానియా మీర్జా?

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోలిటికల్ ఎంట్రీ ఇవ్వను న్నారనే ఓ చర్చజరుగు తుంది అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగనున్నారనే ప్రచారం సర్కిల్‌లో సాగుతోంది.

హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఎంఐఎం పార్టీకి కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీకి ప్రత్యర్థిగా సాని యాను బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకోవైపు లోక్‌సభ ఎన్నిక లకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస పార్టీ ఎంపిక చేసి ప్రకటించింది. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ క్రమంలో అభ్య ర్థుల ఎంపిక కోసం.. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బుధవారం సమావేశమైంది.

ఈ సమావేశంలో హైదరా బాద్ లోక్‌సభ అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక తన రాజకీయ రంగ ప్రవే శంపై సానియా మిర్జా కానీ ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జా కానీ ఎటువంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు చేయలేదు.

దీంతో హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. మరోవైపు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా మాధవీ లత పేరును ఆ పార్టీ అగ్రనా యకత్వం ఇప్పటికే ప్రకటించింది.

ఈ సారి ఎలాగైనా హైదరా బాద్‌ లోక్‌సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకో వాలని బీజేపీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో పాతబస్తీతో పలు సామాజిక సేవా కార్యక్రమా లు చేపడుతోన్న మాధవి లత పేరును బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసిన విషయం విధితమే.

హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని పలు దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీ కైవసం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు సలావుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

దీంతో ఆ పార్టీకి ఈ నియో జకవర్గానికి కంచుకోటగా మారింది. అలాంటి వేళ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకో నేందుకు బీజేపీ అగ్రనా యకత్వం సైతం మాధవి లతను బరిలో దింపి వ్యూ హాత్మకంగా అడుగులు వేసింది.

అలాంటి వేళ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సైతం బలమైన అభ్యర్థిని రంగం లోకి దింపే అవకాశాలు ఉన్నాయని.. దాంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది.

అలాంటి సమయంలో సానియా మిర్జాను రంగం లోకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం సాగుతోంది. అదీకాక సానియా మిర్జాకి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ కురాలు సోనియా గాంధీతో సన్నిహిత సంబంధాలున్న సంగతి అందరికీ తెలిసిందే

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:16

ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత

హైదరాబాద్‌: హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు..

వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

''చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న.. అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు. పైగా.. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? బంధుత్వాలకు అర్థం తెలుసా? చిన్నాన్నను ఎవరు చంపారో దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నారు. అవును మీరు నిజమే చెప్పారు. వివేకాను చంపించింది ఎవరో.. దేవుడికి, మీకు, జిల్లా ప్రజలకు తెలుసు. అందుకే నిందితులను అంత బాగా రక్షిస్తున్నారు.

హంతకుడే చెబుతున్నాడు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డే వివేకాను హత్య చేయించారని. ఒకరు చెప్పింది నమ్ముతున్నారు.. ఇంకొకరు చెప్పింది నమ్మడం లేదు. ఐదేళ్లు మీ ప్రభుత్వం ఉండి కూడా ఏం చేశారు? నిందితులను రక్షించేది మీరు కాదా? గతంలో సీబీఐ విచారణ కోరింది మీరే.. ఆ తర్వాత పిటిషన్‌ ఉపసంహరించుకున్నదీ మీరే. ఎన్నికలు వస్తున్నాయని ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా? మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే బయటకు రావాల్సి వచ్చింది. ఎవరు స్వార్థపరులు? ఎవరు పదవుల కోసం హత్య కేసును వాడుకుంటున్నారు.

హంతకులకు ఓటు వేయమని మీరు అడుగుతున్నారు. సినిమాలో రౌడీలు ఉంటారు, విలన్‌ ఉంటాడు. కేవలం రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా? విలన్‌ను కూడా పట్టుకోవాలి కదా. చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు అవుతోంది. సానుభూతి పొంది ఎన్నికల్లో ఓట్ల కోసం పాకులాడుతున్నారు. తండ్రిని కోల్పోయి నేను న్యాయం కోసం పోరాడుతున్నా. హంతకులకు ఓటు వేయవద్దని మరోసారి ప్రజలను కోరుతున్నా. పదవుల కోసమని నాపై ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం నేను పోరాడుతున్నా. సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను జగన్‌ తెరపైకి తెస్తున్నారు. వైకాపా పునాదులు వివేకా రక్తంలో మునిగి ఉన్నాయి'' అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు..